Mobile phone cover: ఫోన్‌ కవర్‌ కలర్‌ మారిందా.. ఎందుకో తెలుసుకోండి!

-

Mobile phone cover: మెుబైల్‌ ఫోన్‌ ఇప్పుడు ఒక నిత్యావసరంగా మారిపోయింది. ఫోన్‌ చేతిలో లేకపోతే.. ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలవటం పరిపాటిగా మారింది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరి చేతుల్లో ఇప్పుడు మెుబైల్‌ ఫోన్స్‌ దర్శనం ఇస్తున్నాయి. మరి అంత ఇంపార్టెంట్‌ అయిన ఈ ఫోన్‌ను అంతే భద్రంగా కాపాడుకోవటానికి, వివిధ రంగుల్లో, వివిధ ఆకృతుల్లో మెుబైల్‌ ఫోన్‌ బ్యాక్‌ కవర్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌కు ఎటువంటి డ్యామేజ్‌ కాకుండా ఈ కవర్‌ కాపాడుతుంది. మిక్కీమౌస్‌ నుంచి ఇష్టమైన వారి ఫోటోలను సైతం మెుబైల్‌ కవర్స్‌ మీద వేయించుకోవటం చూశాం. కానీ ఇప్పుడు ఫోన్‌ కలర్‌, అండ్‌ స్లిప్‌నెస్‌ కనిపించటం కోసం ఎంతోమంది ట్రాన్స్‌పరెంట్‌ పౌచ్‌లను (Mobile phone cover) వాడటం మెుదలుపెట్టారు. కానీ, ఫోన్‌కు పెట్టిన కొన్ని రోజులకే యెల్లో కలర్‌ వచ్చేస్తుంది. ఎందుకు ఇలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

- Advertisement -

ఈ ట్రాన్స్‌పరేంట్ కవర్‌లను TPU (థర్మో ప్లాస్టిక్‌ పాలీ యురేథిన్‌) మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఎక్కువుగా ఇవి కలర్‌ మారటానికి కారణం సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలే. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలకు కవర్‌లోని టీపీయూ కెమికల్స్‌ రియాక్ట్‌ అవ్వటంతో, రంగు మారటం ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ఫోన్‌ ఎక్కువుగా వాడినప్పుడు ఫోన్‌ వేడక్కటం వల్ల, ఛార్జింగ్‌ పెట్టినప్పుడు వచ్చే వేడివల్ల రంగు మారుతుంది. అంతేగాకుండా చేతి నుంచి వచ్చే చెమట, మన చేతి వేడిమి వల్ల సైతం కవర్‌ కలర్‌ మారుతుంది. రంగు మారిన పౌచ్‌ను మళ్లీ పాత రంగులోకి మారాలంటే రెండు నుంచి మూడు చుక్కల వాష్‌ సోప్‌ను వేడి నీటిలో వేయండి. ఆ నీటితో పౌచ్‌ను వేసి, పాత బ్రష్‌తో సున్నితంగా రుద్ది, నీటితో కడిగేయండి. మళ్లీ మీ పౌచ్‌ పాత రంగులోకి వచ్చేస్తుంది. ఒకవేళ వాష్‌ సోప్‌ అందుబాటులో లేకపోతే, బేకింగ్‌ సోడాను క్రీమ్‌లా వచ్చేలా నీటితో కలిపి, ఆ క్రీమ్‌ను కవర్‌పై వేసి బ్రష్‌తో నెమ్మదిగా రుద్దితే, తళతళమని ట్రాన్స్‌పరెంట్‌ కలర్‌లోకి మారిపోతుంది. మీరూ ట్రై చేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...