పిల్లలకు మిల్లెట్స్ ఆహారంగా పెడితే ఏమవుతుంది?

-

ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు తమ రోజువారీ ఆహారంలో మిల్లెట్స్(Millets) ని చేర్చుకుంటున్నారు. పెద్దవారు మిల్లెట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే. మరి చిన్న పిల్లలకి ఇవి పెట్టవచ్చా? పెడితే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే పిల్లలు మిల్లెట్స్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదలకి పోషకాహారం చాలా ముఖ్యం. ఎంత మంచి ఫుడ్ ఇస్తే వారి ఎదుగుదల అంత బావుంటుంది. మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలతో ఉండే ఫుడ్స్ పిల్లలకి శక్తిని అందించి వారిని బాగా పెరిగేలా చేస్తాయి. మిల్లెట్స్ అలాంటి పోషక విలువలు చాలా ఉన్నాయి అని నిపుణులు చెబతున్నారు. ఏ చిరుధాన్యాలు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరిస్తున్నారు.

- Advertisement -

Millets కొర్రలు:

కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. ఇవి పెద్దవారికే కాదు. చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది. అత్యంత పోషకమైన సూపర్ గ్రెయిన్స్ లో ఈ కొర్రలు కూడా ఉన్నాయండి. ఇందులో ప్రోటీన్స్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ బిడ్డ ఎదుగుదలకి హెల్ప్ చేస్తాయి. ఇది ఐరన్, కాల్షియానికి గొప్ప మూలం. కాబట్టి, వీటిని తీసుకోవడం వల్ల పిల్లల ఎముకలు బలంగా మారతాయి. వీటిని వారానికి ఓసారి ఎలా అయినా ఇవ్వొచ్చు. కిచిడీలా చేయొచ్చు. లేదా పొంగల్, పాయసం, జావ లా అయినా చేసి తాగించవచ్చు.

రాగులు:

రాగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముందుతరం వారు వీటినే ఎక్కువగా తినేవారు దాంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. తల్లులు ఆరోగ్యంగా ఉండడానికి, దంత ఆరోగ్యానికి, పిల్లల ఎదుగుదలకి అవసరమయ్యే కాల్షియం రాగుల్లో పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల్లో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. వీటిని కూడా జావ, దోశ, ఇడ్లీ, లడ్డూల్లా చేసి ఇవ్వొచ్చు.

జొన్నలు:

జొన్నలు కూడా చాలా ముఖ్యమైన చిరుధాన్యాలు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తింటే ఎముకలు, గుండె ఆరోగ్యం బావుంటుంది. జీర్ణక్రియ మెరుగ్గా మారి రక్తప్రసరణ పెరుగుతుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. వీటిని పిల్లలకు స్నాక్స్ లా చేసి ఇవ్వొచ్చు. అలా చేస్తే వారు వీటిని ఎంజాయ్ చేస్తూ తింటారు.

రాజ్ గిరా:

రాజ్ గిరా(Millets) కూడా పిల్లలకి పెట్టొచ్చు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచే కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి పిల్లలని కాపాడుకోవచ్చు. వీటిని లడ్డూల్లా చేసి ఇవ్వొచ్చు. కూరగాయల తో కలిపి కట్లెట్ లా చేసి ఇవ్వొచ్చు. దోశలు కూడా చేసి ఇవ్వొచ్చు.

Read Also: ఇవి తింటే ఉన్న వయసుకంటే 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...