కొవిడ్ 19 వ్యాక్సిన్… ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

-

Nobel Prize 2023 | కొవిడ్-19 వైరస్ పై పోరు కోసం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో(Katalin Kariko), డ్రూ వెయిస్మన్(Drew Weissman) లను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. కరోనా వైరస్ కు వేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి వీరిద్దరి పరిశోధనలు దోహదపడ్డాయని అవార్డు ఎంపిక కమిటీ ప్రశంసించింది. కాటలిన్ స్వస్థలం హంగరీ కాగా, అమెరికాలో స్థిరపడ్డారు. వైద్యశాస్త్రంలో నోబెల్ కు ఎంపికైన 13వ మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. అమెరికన్ శాస్త్రవేత్త వెయిస్మన్ తో కలసి ఆమె సాగించిన పరిశోధనల వల్ల ఎంఆర్ఎన్ఏ టీకా మన రోగనిరోధక వ్యవస్థతో చర్యలు జరిపే తీరుపై సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

- Advertisement -

ఎంఆర్ఎన్ఏ అంటే..?

సంప్రదాయ టీకాల తయారీ విధానంలో.. లక్షిత వైరస్లలు లేదా అందులోని భాగాలను భారీగా వృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని శుద్ధిచేసి, తదుపరి దశల్లో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో సజీవ లేదా బలహీనపరచిన వైరస్లలను శరీరంలోకి చొప్పించాల్సి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎస్ఏ) విధానం ఇందుకు పూర్తి భిన్నమైంది. ఇందులో తాత్కాలిక జన్యు సంకేతం ఉంటుంది. లక్షిత వైరస్లో ని ఎంపిక చేసిన భాగాన్ని ఉత్పత్తి చేయాలంటూ మన కణాలకు ఆదేశాలు అందులో ఉంటాయి. దాన్ని మన కణాలు రీడ్ చేసి.. ఆ ప్రొటీన్ను తయారుచేస్తాయి. అంటే.. మన శరీరమే ఒక మినీ టీకా కర్మాగారంగా మారిపోతుంది. అలా ఉత్పత్తయిన ప్రొటీన్ ఆధారంగా మన రోగనిరోధక వ్యవస్థ స్పందించి.. సంబంధిత ప్రొటీన్లను అడ్డుకునే యాంటీబాడీలు, ఇతర ప్రత్యేక కణాలను తయారుచేస్తుంది.

Nobel Prize 2023 | ఈ విధంగా భవిష్యత్ లో సంబంధిత వైరస్ సోకినప్పుడు వెంటనే స్పందించి, ఇన్ఫెక్షన్ కు అడ్డుకట్ట వేసేలా ముందే శిక్షణ పొందుతుంది. ఎంఆర్ఎస్ఏ(MRNA) టీకా తయారీకి వైరస్ అవసరం ఉండదు. అయితే, ల్యాబ్ లో వృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏను చొప్పించడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రతిచర్య తలెత్తుతుంది. అది ఎంఆర్ఎన్ఏ ను నాశనం చేస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమించే విధానాన్ని కాటలిన్, వెయిస్మన్ లు కనుగొన్నారు. “ఈ వెసులుబాట్ల వల్ల ఎంఆర్ఎన్ఏ టీకాలను వేగంగా అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతోంది. ఇతర సాంక్రమిక వ్యాధులకూ వ్యాక్సిన్లను రూపొందించ డానికి ఇది అనువైన వేదికగా మారింది. కొన్ని రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి నిర్దిష్ట ప్రొటీన్లను చేరవేయడానికి కూడా ఈ సాంకేతికతను వాడొచ్చు” అని నోబెల్ ఎంపిక కమిటీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...