అక్కినేని అఖిల్ ఏజెంట్ చిత్రంలో – ఆ అగ్ర‌ హీరో

A Top hero In Akkineni Akhil Agent movie

0
92

అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో అఖిల్ ని చాలా స‌రికొత్త‌గా చూపిస్తున్నారు. మంచి హిట్ కోసం అఖిల్ కూడా చూస్తున్నారు. ఇప్ప‌టికే బయటికి వచ్చిన ఆయన లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సాక్షి వైద్యను తీసుకున్నారు. తెలుగులో ఈ అమ్మాయికి ఇదే మొదటి సినిమా. ఇక ఆమె కూడా అద్భుతంగా చేసింద‌నే వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది చిత్ర యూనిట్ నుంచి. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర ఉంది, దాని కోసం మమ్ముట్టి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక తెలుగులో ఆయ‌న యాత్ర సినిమా చేశారు. ఇది సూప‌ర్ హిట్ అయింది. ఇక ఆయ‌న‌ని ఓ కీల‌క పాత్ర కోసం సంప్ర‌దించార‌ని ఒకే చెప్పారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు మేక‌ర్స్