కూతురు క్యారెక్టర్ చేసిన నటితో అమీర్ ఖాన్ పెళ్లి!

-

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గజినీ, దంగల్(Dangal) వంటి సినిమాలతో భారతదేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ వివాదాలకు దూరంగా ఉంటారు. తన వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఏడాదిన్నర కిందట భార్య కిరణ్ రావుకు విడాకులు ఇవ్వగా.. అప్పటి నుంచి ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌(Fatima Sana Shaikh)తో డేటింగ్ చేస్తున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక తాజాగా వారిద్దరూ కలిసి పికిల్‌బాల్ గేమ్ ఆడుతున్న వీడియో వైరల్ కావడంతో వీళ్లిద్దరి రిలేషన్‌షిప్‌ న్యూస్ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌ క్రిటిక్‌ కమల్ ఆర్ ఖాన్(KRK) కీలక వ్యాఖ్యలు చేశాడు. అమీర్ త్వరలో సనాని పెళ్లి చేసుకోబోతున్నాడని ట్వీట్‌తో షాక్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ తన కూతురి వయసున్న ఫాతిమా సనా షేక్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. ‘దంగల్’ సినిమా నుంచి సనాతో అమీర్(Aamir Khan) డేటింగ్ చేస్తున్నాడు’ అని కేఆర్‌కే చేసిన ట్వీట్ నెటిజన్లను సర్‌ప్రైజ్ చేసింది. ఇక ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...