కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే… ఇటీవలే కేంద్రం షరతులతో కూడిన పర్మీషన్లు ఇవ్వడంతో బాలీవుడ్ స్టార్ హీరోలు తమ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే టాలీవుడ్ లో మాత్రం షూటింగ్ మొదలు కాలేదు…
సీనియర్ హీరోలు షూటింగ్ కు సిద్దమవుతున్నారు కానీ యువ హీరోలు మాత్రం షూటింగ్ కు వెళ్లకున్నారు… ఇప్పటికే బాలయ్య షూటింగ్ కు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే… ఇక హీరో నాగ్ అయితే వైల్డ్ డాగ్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టేశాడు… అయితే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విషయంమాత్రం తేలడంలేదు…
కొరటాలకి ఆచార్య షూటింగ్ విషయంపై క్లారిటీలేదో చిరు కావాలనే ఆగుతున్నారో తెలియదు కానీ ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ అప్ డేట్ విడుదల కాకుంది… దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు… ఇదే క్రమంలో మరో వార్త హల్ చల్ చేస్తోంది… షూటిగ్ మొదలు అయితే రామ్ చరణ్ తో స్టార్ట్ అవుతుందని అంటున్నారు… కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది…