ఆచార్య సినిమా నుంచి త్రిష అవుట్ …కొర‌టాల‌కు షాక్

ఆచార్య సినిమా నుంచి త్రిష అవుట్ ...కొర‌టాల‌కు షాక్

0
256

మెగాస్టార్ సినిమా అంటే ఎవ‌రైనా ఎగిరి గంతేస్తారు.. ఆయ‌న‌తో సినిమా అంటే ఎవ‌రైనా ఒకే చేస్తారు, తాజాగా ఆయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు.. ఈసినిమాకి ఆచార్య అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు.నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

తాజాగా నేడు ఈ సినిమా యూనిట్‌కు హీరోయిన్ త్రిష షాకిచ్చారు. ఆమె తాజాగా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది, కాని ఆమె ఈ చిత్రం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపారు,అధికారికంగా ప్ర‌క‌టించింది త్రిష
ముందు నాతో డిస్క‌స్ చేసిన దానికి ఇప్ప‌టికి తేడా ఉంది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా నేను చిరంజీవి సార్ సినిమాలో భాగం కావాల‌నుకోవ‌డం లేదు.

సినిమా యూనిట్ కు అభినంద‌న‌లు ల‌వ్ లీ మ‌రో తెలుగు సినిమాతో అభిమానుల‌కి క‌లుస్తా అని చెప్పారు త్రిష… గ‌తంలో స్టాలిన్ సినిమాలో చిరుతో క‌లిసి ఆమె న‌టించారు ..ఇలా ఎందుకు ఆమె ర‌ద్దు చేసుకున్నారు అనేదానిపై చ‌ర్చ జ‌రుగుతోంది, త్వ‌ర‌లో కొత్త హీరోయిన్ ని ప్రాజెక్ట్ కి తీసుకుంటార‌ట‌.