Shivaji | మెగా ఫ్యామిలీపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

-

నటుడు శివాజీ(Shivaji) ప్రస్తుత ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన ‘90’s– ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’అనే వెబ్‌ సిరీస్‌ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సిరీస్ ఈటీవీ విన్ యాప్‌లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

- Advertisement -

ఇక ఈ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)తో మీరు కలిసి నడవచ్చు కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ “మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ ఎవ్వరికి లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమేమి కాదు. ఎక్కడో చిన్నలోపం ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే ఎవరో ఒక్కరు కచ్చితంగా సీఎం కావొచ్చు. గతంలో బీజేపీలో ఉన్నాను. అక్కడ ఇమడిలేక బయటి వచ్చి పదేళ్లు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాడాను. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అడిగాను. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నాకు ఓ కుటుంబం ఉంది. ఎన్నాళ్లని ఒక్కడినే పొరాడగలను” అని తెలిపారు. ప్రస్తుతం శివాజీ(Shivaji) వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గతంలోనూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తనదైన శైలిలతో ఆయన స్పందించిన విషయం విధితమే. కాగా బిగ్‌బాస్‌ తాజా సీజన్‌లో రన్నరప్‌గా శివాజీ నిలిచిన సంగతి తెలిసిందే. శివన్నగా సెటిల్డ్ గేమ్ ఆడి అందరిని అలరించారు. పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలవడంలో తనదైన కృషి చేశారు.

Read Also: తరుచూ సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...