బిగ్ బాస్ లో ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన భూమిక – అభిమానులు షాక్

Actress Bhoomika Clarified on entry in Bigg Boss

0
104

బిగ్ బాస్ రియాల్టీ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన ఇండియాలో ప్రారంభం అయిన అన్నీ భాషల్లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. తెలుగులో మరో రెండునెలల్లో ఐదో సీజన్ కూడా షురూ కానుంది. ఇప్పటికే హౌస్ లోకి ఎవరిని పంపాలా అని కంటెస్టెంట్స్ కోసం నిర్వాహకులు ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

ఇక చాలా మంది తమకు అవకాశం వస్తే బాగున్ను అనుకుంటారు. మరికొందరు మాత్రం నిర్మొహమాటంగా, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్లము అని చెబుతున్నారు.హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ షో ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం అన్ని భాషలలోనూ విస్తరించింది. తాజాగా సీనియర్ హీరోయిన్ భూమికకు ఈ షో నుంచి ఆఫర్ వచ్చిందంటూ కోలీవుడ్, టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. ఇక ఆమె కచ్చితంగా ఈ షోకి వెళతారని అందరూ భావించారు.

కాని ఈ వార్తలపై భూమిక క్లారిటీ ఇచ్చారు, నాకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. నాకు వచ్చినా నేను షోకి వెళ్లను, గతంలో నాకు అనేక సీజన్ల నుంచి పిలుపు వచ్చింది .అయినా నేను నో చెప్పాను, నాకు 24 గంటలు కెమెరాల ముందు ఉండటం ఇష్టం లేదనే విషయం, సోషల్ మీడియాలో తెలిపింది భూమిక.