దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఫైర్ – వీడియో

Cricketer MSK Prasad Comments on demolition of Mentally handicapped school

0
45

 

విశాఖ: మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు విద్యార్థులతో 2013లో ప్రారంభమై నేటికి 150కి పైగా విద్యార్థులకు జ్ఞానాలయంగా మారిందని తెలిపారు.

పాఠశాల నెలకొల్పిన శ్రీనివాస్‌ జీవితమంతా స్కూల్‌కే అంకితం చేశారని ఎమ్మెస్కే ప్రసాద్‌ గుర్తుచేశారు. అందుకే శ్రీనివాస్‌కు జ్యువెల్ ఆఫ్ ఇండియా అనే అవార్డు వచ్చిందన్నారు. దీనిపై సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పునరాలోచించాలని ప్రసాద్‌ కోరారు. విశాఖలో మానసిక దివ్యాంగులకు చదువు చెప్పే పాఠశాలను శనివారం జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు.

దివ్యాంగులంటే ఎవరికైనా సానుభూతి ఉంటుంది. కానీ, ఆ మాత్రం మానవత్వం కూడా కూల్చివేతల కోసం వచ్చిన అధికారులు చూపించలేదని ఆ పిల్లల తల్లిదండ్రులు, నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.

క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించిన  వీడియో చూడండి..https://www.facebook.com/alltimereport/videos/4146905382056155