కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్

actress keerthy suresh enters new business

0
90

చిత్ర సీమలో చాలా మంది ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారాల్లో కూడా దూసుకుపోతున్నారు. సినిమా నిర్మాణ రంగం, పలు హోటల్స్, దుస్తుల వ్యాపారం ఇలా అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మరో అందాల తార ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అందాలభామ కీర్తి సురేశ్ తాజాగా కాస్మెటిక్స్ వ్యాపారంలో ప్రవేశించింది.

భూమిత్ర బ్రాండ్ పేరుతో చర్మసౌందర్య ఉత్పత్తులు తీసుకువస్తోంది. సోషల్ మీడియాలో అమ్మడు ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆమె అభిమానులు ఆమెకి బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మరి ఆమె ఏం తెలియచేసిందో చూద్దాం. వచ్చేసింది నా బ్రాండ్ భూమిత్ర ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందని చెప్పడానికి ఎంతో ఉద్విగ్నంగా ఉంది.

ఎంతో సమర్థవంతం, విభిన్నం, స్వచ్ఛం, ప్రాకృతికం, సహజసిద్ధమైన పదార్థాలతో మా సౌందర్య ఉత్పత్తులు తయారయ్యాయి. మా ఉత్పత్తులు నూటికి నూరుశాతం పరిశుద్ధం, పర్యావరణ హితం అని కీర్తి తెలియచేసింది. మరి మీరు ఆ ట్వీట్ చూడండి ఆ ప్రొడ‌క్టుల‌ని చూడండి.

https://twitter.com/KeerthyOfficial/status/1428639598339444736