ఆదిపురుష్ లో సీత పాత్రలో నటించడంపై అనుష్క క్లారిటీ….

ఆదిపురుష్ లో సీత పాత్రలో నటించడంపై అనుష్క క్లారిటీ....

0
122

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తొలి హిందీ మూవీ ఆదిపురుష్… ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కస్తున్నాడు.. ప్రభాస్ ఈ చిత్రంలో రాముడు పాత్రలో నటిస్తున్నాడు.. లక్ష్మణుడు పాత్రలో సౌత్ యంగ్ హీరో నటిస్తున్నారని వార్తవచ్చాయి…

ఇది ఇలా ఉంటే రావనుడు పాత్రలో మాత్రం సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు… చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది… ఇక సీత పాత్రలో అనుష్క నటిస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి… తాజాగా ఈ వార్తలపై ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది…

ఇవన్నీ పుకార్లు మాత్రమే అని కొట్టిపారేసింది ఆదిపురుష్ చిత్ర బృందం తనను ఇంతవరకు సంప్రదించలేదని తెలిపింది… ఒక వేళ అంత గొప్ప పాత్రలో నటించే అవకాశ వస్తే తానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపింది…