గవ్వలు- శంఖాలు ఏ దేవుని రూపాలు

గవ్వలు- శంఖాలు ఏ దేవుని రూపాలు

0
49

చాలా మంది ఇంటిలో గవ్వలు ఉంటాయి, ముఖ్యంగా దేవుని దగ్గర శంఖాలు కూడా ఉంటాయి, దేవుడికి ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రతి రూపంగా ఉంచుతారు గవ్వలు..ఇవి సముద్రంలో దొరుకుతాయి అనేది తెలిసిందే.. శంఖాలు కూడా సముద్ర గర్భం నుంచి వస్తాయి… కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది.

దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. అందుకే ఇప్పటికీ నార్త్ సైడ్ చాలా ప్రాంతాల్లో వీటితో దీపావళికి ఆటలు ఆడతారు..గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు.

శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. ఇక గవ్వలని తొక్కకూడదు, పుణ్యక్షేత్రాలలో గవ్వలు కొనుక్కొని తెచ్చుకుని దేవుని పటాల దగ్గర పెట్టుకుంటే మంచిది.