పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) శ్రీముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) సీతగా.. సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) రావణాసురిడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్(Adipurush)’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ముఖ్యంగా హిందీలో ఎక్కవ ఏరియాల్లో విడుదలైంది. అయితే, అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి రోజు సినిమా చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు చేశారు. తాజాగా.. ఈ ట్రోలింగ్‌పై చిత్ర రచయిత(Adipurush Writer) మనోజ్ ముంతాషిర్ స్పందించారు. రామాయణాన్ని చిన్నప్పటి నుంచి విన్నట్టుగానే ఆదిపురుష్ సినిమా ద్వారా చెప్పామని, అందులో మార్పులేమీ చేయలేదని చెప్పారు. ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని పూర్తిగా మార్చి చూపించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అదిపురుష్ సినిమాలో డైలాగులు, పాత్రల వర్ణన భిన్నంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తడంపై ఆయన స్పందించారు. హిందూ పురాణ గాథ అయిన రామాయణాన్ని చూపించడంలో తాము ఎక్కడా డీవియేట్ కాలేదని మనోజ్ ముంతాషిర్ శుక్లా(Manoj Muntashir Shukla) చెప్పారు. రామాయణాన్ని పూర్తిగా మూడు గంటల్లో చూపించడం సాధ్యం కాదని, అందుకే మిగతా స్టోరీని పూర్తిగా కట్టె.. కొట్టె.. తెచ్చె.. అన్నట్టుగా చూపించి ఆఖరి యుద్ధకాండను వివరంగా చూపించే ప్రయత్నం చేశామని సినిమా డైరెక్టర్ ఓం రౌత్(OM Raut) ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Read Also:
1. సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గిన మహేశ్ బాబు!
2. విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్‌డేట్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat