నాగార్జున తో జతకట్టనున్న అదితిరావు హైదరీ

నాగార్జున తో జతకట్టనున్న అదితిరావు హైదరీ

0
103

హీరోయిన్ అదితిరావు హైదరీ తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. అందులో ‘సమ్మోహనం’ విడుదల కాగా.. ‘అంతరిక్షం’ డిసెంబర్‌లో విడుదల కానుంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో విడుదలవుతున్న ‘చెక్కం చివంద వానమ్’ (నవాబ్) త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలు కాకుండా తెలుగు, తమిళంలో తెరకెక్కబోయే ఓ సినిమాలో అదితిరావు నటించనున్నారు.

కింగ్ నాగార్జున చాలా గ్యాప్ తర్వాత తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఓ మల్టీస్టారర్. ఇందులో నాగ్‌తో పాటు ధనుష్ కూడా నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ధనుష్ నటిస్తూనే.. సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం.