మహానటి సావిత్రి జీవిత ఆధారంగా ‘మహానటి’ అనే సినిమా తీశారు.ఈ సినిమా తెలుగు,తమిళ భాషల్లో సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ఈ చిత్రంలో సావిత్రి పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది.
సావిత్రి పాత్రకోసం ముందుగ దర్శకుడు హీరోయిన్ నిత్య మీనన్ ను సంప్రదించడం జరిగిందని సమాచారం, కాని నిత్య మీనన్ మహానటి చెయ్యడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ స్థానంలో కీర్తి వచ్చింది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రతో నటిగా ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది.. నిత్య మీనన్ ఆ సినిమాను మిస్ అయ్యింది.దానికి కారణం ఏమిటన్న విషయం తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను చేసిన అలా మొదలైంది మూవీని చూసిన చాలామంది సావిత్రిలా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారన్నారు. ఆ తర్వాత మహానటిలో సావిత్రి పాత్రను పోషించాలన్న ఆఫర్ తనకు వచ్చినట్లుగా చెప్పింది.
సావిత్రి పాత్రకు అడుగుతున్నారన్న మాట తనకు చాలా సంతోషం వేసిందని.. సావిత్రి పాత్ర కోసం ముందు తన వద్దకే వచ్చారని.. అందుకు తాను ఓకే చెప్పానని చెప్పారు. సావిత్రి పాత్రను పోషించటం అంటే మాటలా? అందుకే వెంటనే ఓకే చెప్పానని.. కానీ ఆ తర్వాత మాత్రం సినిమాను వదులుకున్నట్లు చెప్పిన నిత్య.. అందుకు కారణం అడిగితే చెప్పలేనని చెప్పటం గమనార్హం.