ఆ హీరోకి తల్లిగా నటించనున్న అక్కినేని అమల

ఆ హీరోకి తల్లిగా నటించనున్న అక్కినేని అమల

0
117

అమల అక్కినేని టాలీవుడ్ లో హీరోయిన్ గా అనేక సినిమాలు చేశారు, తర్వాత ఆమె అక్కినేని నాగార్జునని వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు.. పూర్తిగా కుటుంబానికి పరిమితం అయ్యారు ఆమె, అయితే పెట్స్ అంటే ఆమెకి చాలా ఇష్టం అనేది తెలిసిందే, ఇక అమల ఏదైనా మంచి పాత్రలు వస్తే నటించాలి అని భావించారు, ఇలా ఆమధ్య లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో అమ్మ పాత్రలో కనిపించింది.

నిజంగా ఈ సినిమాలో అమల ఆ పాత్రకి బాగా సెట్ అయ్యారు, ఆ పాత్రలో నిజంగా అమ్మగా ఆమె ఒదిగిపోయారు అనే చెప్పాలి.
ఇక మళ్లీ సినిమాల్లో పెద్దగా ఆమె కనిపించలేదు, ఇక తాజాగా టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది, అమల మరోసారి అమ్మపాత్రలో కనిపించనున్నారట.

శర్వానంద్కు తల్లిగా కనిపించనున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శర్వానంద్ ఇప్పటికే శ్రీకారం చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు తన 30వ సినిమాను కూడా పూర్తిచేసుకున్నారు. ఈ సినిమాలో ఆమె మదర్ గా నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి, శ్రీకారం తర్వాత ఈ సినిమా విడుదల కానుంది మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.