ఆర్ ఎక్స్ 100 దర్శకుడు కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది

ఆర్ ఎక్స్ 100 దర్శకుడు కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది

0
88

ఆర్ ఎక్స్ 100ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.. కొత్త కాన్సెప్ట్ గా తీశారు దర్శకుడు అజయ్ భూపతి.. ఈ సినిమా మంచి ఫేమ్ తీసుకువచ్చింది అజయ్ కి, అలాగే రికార్డులు క్రియేట్ చేసింది, అయితే ఆ డైరెక్టర్ మాత్రం తర్వాత తన ప్రాజెక్ట్ చెప్పినా మళ్లీ దానిని ముందుకు తీసుకువెళ్లలేదు కొన్ని కారణాల వల్ల.. తాజాగా ఆయన తన కొత్త సినిమా ప్లాన్ చేస్తుకున్నారట.

దర్శకుడు అజయ్ భూపతి, మహాసముద్రం కథను సిద్ధం చేసుకున్నాడు. నాగచైతన్య సమంత జంటగా ఆయన ఈ సినిమాను చేయాలనుకున్నాడు. చైతూ సమంత ఇద్దరికీ కథ వినిపించడం జరిగిపోయింది. అయితే వారు సినిమా చేయాలని అనుకున్నారు, కాని చైతూకి కొన్ని సినిమా కమిట్మెంట్ ఉన్నాయి. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టేలా ఉంది, అందుకే శర్వానంద్ ను అజయ్ భూపతి సంప్రదించడం జరిగిందట

శర్వానంద్ తాజా చిత్రంగా జాను రూపొందుతోంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సమయంలో శర్వానంద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.. రకుల్ ని పరిశీలిస్తున్నారట లేదా బాలీవుడ్ భామకి అవకాశం ఇస్తారట.