సాక్షి దినపత్రికకి షాక్ 75 కోట్టకు పరువునష్టం దావా

సాక్షి దినపత్రికకి షాక్ 75 కోట్టకు పరువునష్టం దావా

0
55

ఏపీలో తెలుగుదేశం వర్సెస్ వైసీపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కావాలనే తమపై అసత్య వార్తలు రాస్తున్నారు అనేది వైసీపీ చెప్పేమాట… సీఎం జగన్ పై అసత్య వార్తలు వైసీపీ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారు అని బాబు అనుకూల పత్రికలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తారు, ఇక జగన్ సొంత మీడియా సాక్షిపై కూడా ఇటు తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తారు.

తాజాగా సాక్షి దినపత్రికపై టీడీపీ నేత నారా లోకేశ్ రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇది షాక్ కు గురిచేసింది మీడియా సర్కిల్ లో.. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ఈ ఉదయం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. చినబాబు చిరుతిండి 25 లక్షలండి అనే శీర్షకతో గత ఏడాది అక్టోబర్ 22న సాక్షిలో ఓ కథనాన్ని ప్రచురించారు. ఇది లోకేష్ ని టార్గెట్ చేసి రాసిన కథనం అని విమర్శించారు టీడీపీ నేతలు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్… సాక్షిపై పరువునష్టం దావా వేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని సాక్షి ప్రచురించిందని తన వ్యాజ్యంలో లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒరిజినల్ సూట్ 6/2020 నెంబరుతో వ్యాజ్యం దాఖలైంది. అయితే అసలు ఇది వాస్తవం కాదు అని కావాలనే రాజకీయంగా ఎదుర్కోలేని వైసీపీ ఇలాంటి రాతలు రాయించింది అని విమర్శించారు టీడీపీ నేతలు.