అతి ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన బాలీవుడ్ అగ్ర హీరో

Ajay devgan bought the most expensive house

0
124

బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది అత్యంత ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేస్తూ ఉంటారు అనేది తెలిసిందే, ముంబై లో భారీ భవంతులు విల్లాలు అమ్మకానికి వస్తే ప్రాపర్టీ గురూస్ ముందు వీరిని కన్సెల్ట్ అవుతారు. ఎందుకు అంటే లగ్జరీ ఇళ్లు విల్లాలు సొంతం చేసుకునేందుకు బాలీవుడ్ హీరోలు ఎప్పుడు ముందు ఉంటారు.. తాజాగా ప్రముఖ నటుడు అజయ్ దేవ్గణ్ ఓ ఇల్లు కొన్నాడట.

ముంబైలోని జుహులో ఓ విలాసవంతమైన ఇంటిని అతడు తన సొంతం చేసుకున్నట్లు బీటౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా బీ టౌన్ లో ఈ ఇంటి వార్త వినిపిస్తోంది, అయితే దీని విలువ కూడా కళ్లు చెదిరేలా ఉందట.

అతడు ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఈ ఇళ్లు కొనుగోలు చేశారు అని తెలుస్తోంది, సుమారు దీని కోసం 50 నుంచి 60 కోట్లు వెచ్చించారు అంటున్నారు… 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా ఎంతో బాగా నచ్చిందట… ఇక బాలీవుడ్ లోని పెద్ద స్టార్లు అందరూ ఇదే ఏరియాలో ఉంటారు అనేది తెలిసిందే.