అఖండ ప్రమోషన్స్..శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Akhanda Promotions..Srikant Interesting Comments

0
113

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా తన లుక్ తో విపరీతంగా ఆకట్టుకున్నారు.

తాజాగా అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేశాను. సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. మధ్యలో మళ్లీ విలన్‌గా చేశాను. యుద్దం శరణం అనే సినిమాలో విలన్‌గా చేశాను. మీరు ఏది పడితే అది చేయకండని దాని కంటే ముందే బోయపాటి అన్నారు.

బాలయ్య బాబు అఖండ కోసం విలన్ క్యారెక్టర్ చెప్పారు. విన్న వెంటనే భయపడ్డాను. వరదరాజులు క్యారెక్టర్ కు న్యాయం చేయగలనా? అని అనుకున్నాను. ఎందుకంటే బాలయ్య, బోయపాటి సినిమాలో విలన్ అంటే మామూలుగా ఉండదు. ముందు గెటప్ సెట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్నో రకరకాలుగా ట్రై చేశాం. కానీ సహజంగా, సింపుల్‌గా పెట్టేద్దామని అన్నారు. అలా గడ్డంతో చూసే సరికి నేనేనా అనుకున్నానని అన్నారు. ఈ సినిమాలో మీకు కొత్త శ్రీకాంత్ కనిపిస్తాడు. నాక్కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. వరదరాజులు పాత్ర చాలా బాగా వచ్చింది. ఈ సినిమా మీకు తప్పకుండ నచ్చుతుంది.