మీడియా కవరేజ్ పై ఈసీ నిఘా

Easy surveillance on media coverage

0
36

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలకు ముద్రణ, టెలివిజన్, డిజిటల్, సామాజిక మాధ్యమాల్లో లభించే కవరేజ్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రైవేటు సంస్థను నియమించుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) యోచిస్తోంది.

ఈసీ కార్యకలాపాలకు అన్ని రకాల మాధ్యమాల్లో లభించే కవరేజ్‌ను కూడా ఈ సంస్థ గమనిస్తుంది. ఈ సంస్థ తన పరిశీలనలతో కూడిన నివేదికలను ఈసీకి సమర్పిస్తుంది. మీడియా కవరేజ్‌ను పర్యవేక్షించేందుకు ఈసీ ఓ ప్రైవేటు సంస్థను నియమించుకుంటుండటం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.