అక్కినేని వారసుడు హీరో అఖిల్ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై నాగ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఈ హిట్ కోసం భాస్కర్ అఖిల్ కూడా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకి సంబంధించి స్టోరీ కూడా నాగ్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఈ లాక్ డౌన్ టౌమ్ లో చాలా వరకూ ఎడిటింగ్ పూర్తి చేశారట.. ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.
ఈ సినిమా ఇప్పటికే ఆన్ లైన్ ఓటీటీ ద్వారా వస్తుంది అని వార్తలు వచ్చాయి, కాని ఇందులో నిజం లేదు అని తెలుస్తోంది.. పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తోంది..ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు, థియేటర్లు తెరిచిన తర్వాత ఇక సినిమా విడుదల చేస్తారు అని తెలుస్తోంది.