థియేటర్లు ఓపెన్ చేస్తే ఇదే అమలు చేస్తారట

థియేటర్లు ఓపెన్ చేస్తే ఇదే అమలు చేస్తారట

0
56

ఈ లాక్ డౌన్ సమయంలో దాదాపు మార్చి నెల చివరి వారం నుంచి ఒక్క సినిమా కూడా విడుదల అవ్వలేదు.. దేశంలో పూర్తిగా సినిమా థియేటర్లు క్లోజ్ లో ఉన్నాయి, మూడు నెలలుగా అంతా షట్ డౌన్ లో ఉంది, ఓ పక్క సినిమాల చిత్రీకరణ జరగడం లేదు.

అయితే కొందరు ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు, అయితే తాజాగా పలు దేశాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి, అక్కడ జనాలు వస్తున్నా వారికి సరికొత్తగా సీట్లు కేటాయిస్తున్నారు.
థియేటర్లు కూడా టికెట్లపై డిస్కౌంట్లు, ఇతర ఆకర్షణీయ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు యజమానులు,ఫ్రాన్స్ లో తాజాగా థియేటర్లు ఓపెన్ అయ్యాయి.

కరోనా వ్యాపించకుండా హాళ్లలో భౌతిక దూరం కోసం సీట్ల మధ్య మినియన్స్ కామెడీ బొమ్మలను కూర్చోబెడుతున్నారు. దాదాపు సగం సీట్లను బొమ్మలతోనే నింపేశారు. రెండు సీట్లు మధ్య ఇవి ఉంటాయి జంట పక్కన బొమ్మ పెడతారు, ఇలా గ్యాప్ ఇచ్చి సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు, ఇది బాగుంది అని మన దేశంలో ఇదే అమలు చేస్తామని పలు దిగ్గజ స్క్రీన్ యాజమాన్యాలు చెబుతున్నాయి.