అఖిల్ సినిమాకి టైటిల్ వచ్చేస్తోంది

అఖిల్ సినిమాకి టైటిల్ వచ్చేస్తోంది

0
33

అఖిల్ అక్కినేని హిట్ సినిమా కోసం చూస్తున్నారు, అందుకే తాను ఎంచుకునే సినిమాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా నాగార్జున కూడా అఖిల్ సినిమా కథలు వింటున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యే సినిమాలు తీసిన బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ తో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోంది.

ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది, ఇక అక్కినేని అభిమానులు ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ వస్తుందా అని చూస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తున్నారట. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఏం ఫిక్స్ చేశారు అనేదానిపై ఇంకా ప్రకటన రాలేదు.

రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు టైటిల్ ను రివీల్ చేయనున్నారు…మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనీ, దాదాపు ఇదే టైటిల్ ఖరారు చేయవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సో టైటిల్ పై ఇప్పటికే మంచి బజ్ వస్తోంది.. ఇక టీజర్ ట్రైలర్ సాంగ్స్ అదరగొడితే అఖిల్ కు ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు.