Nagarjuna | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని హీరో నాగార్జున(Akkineni Nagarjuna) మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌‌లోని ఆయన నివాసంలో భార్య అమల(Amala)తో కలిసిన నాగార్జున.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే పలువురు సినీ పెద్దలు సీఎంను కలిసి సినీ పరిశ్రమ గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

మరోవైపు నంది అవార్డులపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. వచ్చే ఉగాది నాటికి నంది అవార్డులను ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డులను ఇస్తామని వ్యాఖ్యానించారు. త్వరలోనే అవార్డుల అంశంంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Read Also: సీఎం జగన్‌పై నిర్మాత నట్టికుమార్ తీవ్ర విమర్శలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...