Nagarjuna | పెళ్ళి పీటలెక్కనున్న అఖిల్.. నాగార్జున ఏమన్నాడంటే..

-

అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. ఒకవైపు నాగచైతన్య(Naga Chaitanya)-శోభిత(Sobhita) పెళ్ళికి అంతా సిద్ధమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా డిసెంబర్ 4న వీరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అదే విధంగా మరోవైపు నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కూడా పెళ్ళి పీటలెక్కడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున(Nagarjuna) స్వయంగా ప్రకటించారు.

- Advertisement -

ఇంట వరుస శుభకార్యాలు జరగడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ‘‘ఈ ఏడాది మాకు చాలా ప్రత్యేకం. ఒకవైపు నాన్నగారి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరోవైపు కొడుకులిద్దరూ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. నాగచైతన్య-శోభిత వివాహాన్ని ఇరు కుటుంబాల సమక్షంలో అంగరంగ వైభంగా చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.

‘‘అఖిల్(Akhil Akkineni)-జైనబ్ రవ్జీ(Zainab Ravdjee) నిశ్చితార్థం జరిగింది. జైనబ్ చాలా మంచి అమ్మాయి. ఇతరుల పట్ల ప్రేమ, అభిమానం ఉన్న అమ్మాయి. వారిద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలదు. ఆమెను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వారి పెళ్లి వచ్చే ఏడాది జరగనుంది’’ అని నాగార్జున(Nagarjuna) ప్రకటించాడు.

Read Also: విడాకులు తీసుకున్న ధనుష్-ఐశ్వర్య
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...