“అక్షత శ్రీనివాస్ ఆదరగొట్టింది” అనిపించుకోవాలన్నదే నా ఆకాంక్ష!! -వర్ధమాన కథానాయకి అక్షత శ్రీనివాస్

"అక్షత శ్రీనివాస్ ఆదరగొట్టింది" అనిపించుకోవాలన్నదే నా ఆకాంక్ష!! -వర్ధమాన కథానాయకి అక్షత శ్రీనివాస్

0
87

“శేఖరం గారి అబ్బాయి” సినిమాకి దర్శకత్వం వహించడంతోపాటు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ మంగుళూరు ముద్దుగుమ్మ.. హీరోయిన్ గా వరసగా “సురభి 70 ఎం.ఎం, 3 రెబల్స్, ఎం.ఎం.ఓ ఎఫ్, క్వశ్చన్ మార్క్” చిత్రాలతో తెలుగులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోంది!!

తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కన్నడ హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించుకునే దిశగా స్థిరమైన అడుగులు వేస్తోంది అందాల భామ అక్షత శ్రీనివాస్. ‘శేఖరంగారి అబ్బాయి’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్షత శ్రీనివాస్.. హీరోయిన్ గా ఇప్పటికే అర డజను సినిమాలు చేసి… తన ప్రతిభకు తగ్గ మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిగా అక్షత నటించిన ‘సురభి 70 ఎం.ఎం”, జె.డి.చక్రవర్తితో నటించిన “ఎం.ఎం.ఓ.ఎఫ్”, సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘3 రెబల్స్, క్రేజీ హీరోయిన్ ఆదాశర్మతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న “క్వశ్చన్ మార్క్” చిత్రాలు హీరోయిన్ గా తన రేంజ్ ను పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది అక్షత శ్రీనివాస్. కరోన నిబంధనలకు లోబడి షూట్ చేసిన “క్వశ్చన్ మార్క్” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. తానెప్పుడూ కథలకు ప్రాధాన్యత ఇస్తానని, ముఖ్యంగా ‘డైరెక్టర్స్ హీరోయిన్’ అనిపించుకోవాలన్నదే తన అభిమతమని అక్షత అంటోంది.

అన్నట్లు… ఈ అందాల ముద్దుగుమ్మ తన మాతృభాష కన్నడలో చిరంజీవి సర్జాతో నటించిన ‘శివార్జున’ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది!!