తనను అలా చూడం ఇబ్బందిగా అనిపించింది: అలియా భట్

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే హిందీలో అగ్ర హీరోల సరసన నటించి సత్తా చాటింది. రాజమౌలి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో సౌత్ అభిమానులకు దగ్గరయింది. దీంతో ఆమెను సోషల్ మీడియా వేదికగా ఫాలో అవుతున్న తెలుగు అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, అలియా ‘నేపో బేబీ’ ట్యాగ్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ప్రారంభంలో తనను అలా గుర్తించడం సాధారణంగానే భావించి పెద్దగా పట్టించుకోలేదన్న ఆమె.. రోజులు గడుస్తున్నా కొద్ది తనపట్ల వివక్ష చూపించడం ఇబ్బందిగా అనిపించిందని చెప్పింది.

- Advertisement -

‘కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో నెపోటిజం గురించి చర్చ నడుస్తోంది. అయితే కెరీర్ మొదలుపెట్టడానికి ఇది సహాయం చేసినప్పటికీ, అంతిమంగా ప్రేక్షకుల నిర్ణయమే ముఖ్యమని నేను నమ్ముతా. చిత్ర పరిశ్రమలోకి ఏ సపోర్టుతో వచ్చినా సరే.. మన పనిని నిరూపించుకుంటేనే ఇక్కడ నిలబడగలం. లేదంటే ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడమే. అందుకే కష్టపడి పని చేయడమంటే నాకు ఇస్తామని చెప్పుకొచ్చింది అలియా(Alia Bhatt). ప్రతి సినిమాలో ఉత్తమ ప్రతిభ కనబరచాలనుకుంటా. మీరు ఇక్కడ ఉండాలో లేదో అభిమానులే తుది నిర్ణయం’ అని కీలక వ్యాఖ్యలు చేసింది.

Read Also: చాణక్య నీతి: భార్యను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...