పుష్పలో అల్లు అర్జున్ సోదరుడు పాత్ర ఏమిటంటే?

పుష్పలో అల్లు అర్జున్ సోదరుడు పాత్ర ఏమిటంటే?

0
77

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది, ఈ చిత్రం ఇప్పుడు వైరస్ లాక్ డౌన్ తో పూర్తిగా షూటింగ్ కు బ్రేక్ వేశారు, ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పుడు కాకుండా వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు, ముందు హైదరాబాద్ సరౌండింగ్స్ లో కొన్ని షాట్స్ షూట్ చేయనున్నారు అని తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ కనిపించనున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.

ఈ మూవీలో కథానుగుణంగా అల్లుఅర్జున్ కు ఇద్దరు సోదరులుంటారట. వీరిలో ఓ సోదరుడు గ్రామ సర్పంచ్ గా కనిపిస్తారని టాక్ నడుస్తోంది. ఇక ఈసినిమాకు కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇవ్వనున్నారట, ఇక సుకుమార్ ఇప్పటికే రంగస్ధలం సినిమాలో కూడా కథలో ఇలా చరణ్ కు సోదరుడిగా ఆదిపినిశెట్టిని తీసుకున్నారు, మరి ఇప్పుడు బన్నీకి సోదరుడుగా ఎవరు చేస్తారో చూడాలి.