ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్(Allu Arjun) వెళ్లారు. అది తీవ్ర దుమారం రేపింది. అల్లూ, మెగా ఫ్యామిలీల మధ్య చీలికలకు దారి తీసిందన్న వాదన వినిపిస్తూనే ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఆ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు అల్లు అర్జున్, శిల్పారెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన అల్లూ అర్జున్, శిల్పా రెడ్డి(Shilpa Reddy) తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరిగింది. ఇందులో భాగంగా నవంబర్ 6 వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఆ రోజున ఈ కేసుకు సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో నంద్యాల(Nandyala)కు వచ్చిన అల్లు అర్జున్‌ను వైసీపీ శ్రేణులు భారీ హంగామాతో పట్టణ శివారు నుంచి తీసుకొని వచ్చాయి. భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ తరహాలో అల్లు అర్జున్(Allu Arjun)కు వైసీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. అల్లు అర్జున్ పర్యటనకు అధికారిక అనుమతులు లేనప్పటికీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఇలా చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ నంద్యా టూటౌన్‌లో అప్పట్లోనే కేసు నమోదైంది.
Read Also: ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో నిందితుడు అతడే..!