అల్లుఅర్జున్​, హరీశ్​శంకర్​ కాంబో మళ్లీ రిపీట్?

Allu Arjun, Harish Shankar combo repeat again?

0
110

ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​ డైరెక్టర్ హరీశ్​శంకర్ కాంబినేషన్ లో ఇప్పటికే ​డీజే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ కానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నేడు హరీశ్​ చేసిన ట్వీట్​ ఈ వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది.

ఇంతకీ హరీష్ శంకర్ ఏమని ట్వీట్ చేసారంటే..”మనం కలిసినప్పుడల్లా ఎంతో సరదాగా ఉంటుంది. నీతో కలిసి సమయాన్ని గడపటం గొప్పగా ఉంది. లవ్​ యు. తగ్గేదే లే.. ఎందుకు తగ్గాలి?” అని ట్వీట్​ చేశారు. దీంతో సినిమా చేయడమే కోసమే బన్నీ-హరీశ్​ కలిశారని అభిమానులు ఆశిస్తున్నారు. హరీశ్​ స్క్పిప్ట్​ సిద్ధం చేస్తున్నాడని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. వీరిద్దరు కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్​ చేశారు డైరెక్టర్ హరీశ్​శంకర్.

మరోవైపు డీజే సినిమాను రీమేక్​ చేయాలని బాలీవుడ్​లో సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి కూడా హరీశ్​ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక నటిస్తుండగా..దాక్షాయణి పాత్రలో అనసూయ రోల్ కీలకంగా మారింది.