కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah).. టాలీవుడ్ అగ్ర దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli)తో భేటీ కానున్నారు. ఖమ్మంలో ఈనెల 15వ తేదీన తెలంగాణ బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 14న రాత్రికే హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ నోవాటేల్ హోటల్‌లో ఆయన బస చేయనున్నారు. ఎల్లుండి ఉదయం డైరెక్టర్ రాజమౌళితో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం అక్కడే లంచ్ చేసి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో భద్రాచలం వెళ్లి అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలో పాల్గొంటారు. ఆపై ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు.
దర్శక ధీరుడు రాజమౌళితో అమిత్ షా భేటీ!
-