బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆరిజన్ డెయిరీ సీఈవో శేజల్(Sejal) పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఆమె తాజాగా సీబీఐకి కంప్లైట్ చేసింది. తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా మహిళ సంక్షేమం దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆమె(Sejal) పాలాభిషేకం చేసి నిరసన తెలియజేశారు. మహిళా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్(KCR).. న్యాయం కోసం పోరాడుతున్న తనను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసి ఎమ్మెల్యే చిన్నయ్య చెప్పినట్లు చేయాలంటూ బెదిరించారని ఆరోపించారు. కోర్టుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్న తమను పోలీస్ స్టేషన్‌లోనే బంధించారని శేజల్ వాపోయారు.