జబర్దస్త్ తో బుల్లితెర నటిగా, గ్లామర్ హోస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ అనసూయ. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా ప్రేక్షకులను అలరించిన అనసూయ ఆ సినిమాతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ పక్క బుల్లితెర ఫై రానిస్తూనే మరోపక్క వెండితెర అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. పలు చిత్రాల్లో నటిగా నటించటమే కాకుండా సింగర్ గా కూడా తన ప్రతిభను చాటుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చిత్రంలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఒక పాత్రను రూపోందించి, దానిని చిత్రానికి కీలంగా మారుస్తున్నారు.
అందరిలాగానే తాను కూడా గ్లామర్ డోస్ పెంచిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరోసారి హాట్ ఫోటోషూట్ చేసి మతులు చెడగొట్టేసింది అనసూయ. ఒకటి రెండు కాదు.. దాదాపు 15 ఏళ్ల కిందే ఇండస్ట్రీకి వచ్చింది కానీ గుర్తింపు తెచ్చుకోడానికి చాలా ఏళ్లు పట్టింది. ఇప్పుడు అనసూయ తీరు చూస్తుంటే అంతా షాక్ అవుతున్నారు. అను పేరు వింటే కేవలం గ్లామర్ షో మాత్రమే గుర్తుకు వచ్చేది ఇన్నాళ్లూ. ఇప్పుడు అలా కాదు.. ఈ ముద్దుగుమ్మ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆ ఒక్క సీన్ లోనే తనలో నటన ఉందో గుర్తు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాను కేవలం అందాల ఆరబోతకు మాత్రమే కాదు.. నటిగా కూడా పనికొస్తానని ప్రతీసారి గుర్తు చేస్తూనే ఉంది అనసూయ.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె కోసమే ప్రత్యేకంగా పాత్రలు రాసే స్థాయికి అనసూయ నటన ఎదిగింది. ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేస్తున్న సినిమాలో తరుణ్ భాస్కర్‌తో కలిసి నటించబోతుంది అనసూయ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ పోజులు కూడా ఇస్తుంది ఈ రంగమ్మత్త. మొత్తానికి ఈమె దూకుడు చూస్తుంటే ఓ వైపు యాంకరింగ్.. మరోవైపు నటిగా రప్ఫాడించడం ఖాయంగా కనిపిస్తుంది.