Anchor Anasuya Cyber crime complaint man arrested: యాంకర్ అనసూయ అంటే పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యి, బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా షోలతో పాటు.. సినిమాలతో బిజీ అయిపోయిందీ బ్యూటీ. స్కిన్ షోకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, హీరోయిన్లతో పోటీ పడి మరీ.. గ్లామర్‌తో, తన హాట్ హాట్ ఫోటోలతో హీటెక్కిస్తుంటుంది. అంతేగాకుండా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గానూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో తన ఫోటోలతో పాటు, హీరోయిన్ల ఫోటలను ఫేక్ అకౌంట్స్‌తో పోస్ట్ చేస్తున్న ఆకతాయిలను హెచ్చరించింది అనసూయ.
అయినప్పటికీ ఫేక్ అకౌంట్స్ వాళ్లు వెనక్కి తగ్గకపోవటంతో పాటు, తన ఫోటోలపై అభ్యంతరమైన పోస్టులు చేయటం తగ్గలేదు. దీంతో సీరియస్ అయిన అనసూయ, నా జోలికి వస్తే.. తగ్గేది లేదు వారి అంతు చూస్తా అని సోషల్ మీడియా వేదికగా Anchor Anasuya ఫైర్ అయ్యింది. వార్నింగ్ ఇవ్వటమే కాక, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో హీరోయిన్స్ ఫోటోస్ పెట్టి. అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తున్న నిందితుడు పందిరి రామ వెంకట వీర్రాజును అరెస్టు చేశారు.
నిందితుడు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. గతంలో దుబాయ్‌లో ప్లంబర్‌గా వర్క్ చేసి.. ఇండియాకు తిరిగి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి ల్యాప్‌టాప్‌లో ప్రముఖ నటి రోజా, యాంకర్స్ అనసూయ, విష్ణుప్రియ, రష్మీ, నటి ప్రగతి ఫోటోలతో పోస్టులు ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. నిందితుడిపై 354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు