యాంకర్ రవి ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

Anchor Ravi First Remuneration knows a lot

0
113

తెలుగులో ఫిమేల్ యాంకర్స్ లో సుమకి ఎంతో పేరు ఉంది. ఆమె పదుల సంఖ్యలో షోలు చేశారు. ఇక మేల్ యాంకర్స్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు యాంకర్ రవి. బుల్లితెరలో అనేక షోలు చేశాడు. ఎంటర్ టైన్మెంట్ షోలతో పది సంవత్సరాలుగా టెలివిజన రంగంలో నిలదొక్కుకున్నాడు రవి.

2010లో మా మ్యూజిక్ టీవీలో లవ్ జంక్షన్ షో తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చాడు రవి. ఇక అక్కడ నుంచి రవి వరుసగా అనేక షోలు చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ రెమ్యునరేషన్ గురించి చెప్పాడు. తొలిసారి లైవ్ షోలో ఎపిసోడ్ కి 250రూపాయలు తొలి పారితోషికంగా తీసుకున్నాడట.

Anchor Ravi

అయితే ఇప్పుడు రవికి వేల నుంచి లక్షల్లో రెమ్యునరేషన్ ఉంటుంది. ఇక రవి చిన్నతనం నుంచి క్రికెటర్ అవ్వాలి అని అనుకున్నాడట. ఇక తన భార్య గురించి చెబుతూ, నిత్యా బిటెక్ థర్డ్ ఇయర్ లోనే ఇన్ఫోసిస్ లో జాబ్ తెచ్చుకుందని, ఆమె నెలకు 22వేల 500సంపాదించేదని చెప్పాడు. రవి రోజుకి 250 చొప్పున నెలకి ఎన్ని రోజులు షో ఉంటే అన్ని రోజులు వచ్చేవట.