ఏపీ సీఎం వై.యస్ జగన్ పై బయోపిక్ – హీరో రోల్ పోషించేది ఎవరంటే

0
80

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  బయోపిక్ను తెరకెక్కించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. దీని గురించి టాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్తానాన్ని యాత్ర మూవీగా చిత్రీకరించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు మహి.వి. రాఘవ్ ఈ మూవీని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారట. ఇది ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ టాక్ . పార్టీని నెలకొల్పిన 10 ఏళ్లలోనే అధికారంలోకి  తీసుకొచ్చిన ఆయన జర్నీని ఈ సినిమాలో చూపించనున్నారు.

మరి జగన్ పాత్ర ఎవరు చేస్తున్నారనే ఆలోచన మీకు వస్తుందా. జగన్ పాత్రలో స్కామ్ 1992 ఫేం ప్రతీక్ గాంధీ నటించబోతున్నారని టాలీవుడ్  టాక్. 

prateek gandhi

ఇక  ప్రీతిక్ గాంధీ స్కామ్ 1992 వెబ్ సిరీస్ ద్వారా ఎందరో అభిమానులను సంపాదించాడు. 2020 లాక్డౌన్ సమయంలో ఈ వెబ్ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆయనతో చర్చలు జరుపుతున్నారట.