Animal Movie | బాక్సాఫీస్‌పై ‘యానిమల్’ వసూళ్ల సునామీ..

-

‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ(Animal Movie) బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ అందుకోవడంతో మూవీకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కేవలం భారత్‌లోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Animal Movie | హిందీలో రూ.50 కోట్లు, తెలుగులో రూ.10 కోట్లు, కన్నడ, తమిళ్, మలయాళం కలిపి రూ.10కోట్లు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్‌లో రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. రూ.200కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించిన నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టనుంది. ముఖ్యంగా సందీర్ రెడ్డి(Sandeep Reddy Vanga) డైరెక్షన్, రణ్‌బీర్ యాక్టింగ్ అభిమానులను కట్టిపడేసింది. వీకెండ్ రానుండడంతో మూవీ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశముందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

Read Also: పిల్లలకు మిల్లెట్స్ ఆహారంగా పెడితే ఏమవుతుంది?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...