సినీ ఇండస్ట్రీలో మరో జంట బ్రేకప్..కన్ఫామ్ చేసేసిన బడా హీరో

0
117

సినీ ఇండస్ట్రీలో లవ్, మ్యారేజ్, బ్రేకప్ కామన్ అయిపోయింది. అప్పటివరకు అన్యోన్య జంటగా ఉంటూ సడన్ గా బ్రేకప్ అంటూ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో జంటలు ఇదే దారిలో వెళ్లారు. ఇక తాజాగా మరో జంట కూడా బ్రేకప్ చెప్పబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ , దిశాపటాని చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.  కొంతకాలంగా ఈ లవ్ బర్డ్స్  చెట్టాపట్టలేసుకొని తెగ తిరిగారు. తాజాగా వీరి బ్రేకప్ పై హీరో టైగర్ ష్రాఫ్ ఓపెన్ అయ్యాడు. నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అనే షోలో టైగర్ ష్రాఫ్ పాల్గొన్నాడు.

ఈ షోలో దిశాపటానితో రిలేషన్ గురించి కరణ్ ప్రశ్నించగా టైగర్ ఎదో చెప్పే ప్రయత్నం చేస్తూనే తాను సింగిల్ అని అన్నాడు. దాంతో వీరి బ్రేకప్ ను కన్ఫామ్ చేశాడు టైగర్. దాంతో బాలీవుడ్ ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.