బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్‌ ధర..ఈరోజు ఎంతంటే?

0
44

నగలకు మహిళలు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు. ఏ చిన్న పండగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా బంగారం ధరలు పెరగగా తాజాగా తగ్గుముఖం పట్టాయి. ఇది మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. చివరి మూడు రోజుల్లో తులం బంగారంపై ఏకంగా రూ. 900కిపైగా తగ్గడం విశేషం.

బంగారం ధరలు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 50,620 గా ఉంది.

విజయవాడలో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 50,620 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

ఇక వెండి ధర విషయానికొస్తే రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన వెండి ధరలు శనివారం స్థిరంగా కొనసాగాయి. కానీ నేడు వెండిపై ఏకంగా రూ. 700 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 58,000 వద్ద కొనసాగుతోంది.