కొరటాల-ప్రభాస్ కాంబోలో మరో మూవీ?

0
93

కొరటాల శివ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. తీసిన సినిమాలని బిగ్ హిట్స్. తన చివరి సినిమా ఆచార్య మాత్రం అంతంత మాత్రమే ఆడింది. దీనితో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మారుతాయా? బిగ్ స్టార్స్ తో సినిమాలు చేజారుతాయా? లేక కొత్త ఆఫర్స్ వస్తాయా? ఇలాంటి ప్రశ్నలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.

కొర‌టాల శివ‌ ప్రస్తుతం ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే.. ఈ సినిమా తర్వాత కొరటాల ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలియాల్సి ఉంది. తనకు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చి.. తనను డైరెక్టర్ ను చేసిన ప్రభాస్ తో కొరటాల తన తర్వాత సినిమా ప్లాన్ చేశాడట. కాగా కొరటాల – ప్రభాస్ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

కానీ, ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే ఆ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మరి ఈ కాంబినేషన్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి. అయితే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమా  ఉండబోతుందని టాక్. కాగా కొరటాల మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.