మహేష్ బాబు సర్కారువారిపాట సినిమాలో అనుష్క – రోల్ ఏమిటంటే

మహేష్ బాబు సర్కారువారిపాట సినిమాలో అనుష్క - రోల్ ఏమిటంటే

0
108

టాలీవుడ్ లో మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ తో సర్కారువారిపాట సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి అభిమానులకి .. అంతేకాదు ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ , మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్, ఇక ఇందులో మహేష్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది, బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంగా తీస్తున్నారు చిత్రం, ఇందులో మహేష్ ఎలా కనిపిస్తారా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తోంది…సర్కారు వారి పాట సినిమాలో జేజెమ్మ అనుష్క నటించబోతుందట. అయితే ఆమె నటిస్తుంది అని రెండు రోజులుగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది, అయితే ఇందులో ఆమె ఓ బ్యాంకు ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఇందులో మొత్తం ఇద్దరునటీమణులు ఉంటారు.. ఇక అనుష్కతో కలిపి మొత్తం ముగ్గురు నటిస్తారు అని తెలుస్తోంది, చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, కాని ఆమెతో సంప్రదింపులు అయ్యాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఖలేజా ఈ సినిమా తర్వాత మరే సినిమాలో ఇద్దరూ నటించలేదు, ఇక మరోసారి వెండితరపై వీరిద్దరూ నటిస్తే అదిరిపోతుంది అంటున్నారు అభిమానులు.