దేశంలో కార్మికులకి గుడ్ న్యూస్ చెబుతున్న కేంద్రం – రోజు ఎన్ని గంటలు పని చేయాలంటే

దేశంలో కార్మికులకి గుడ్ న్యూస్ చెబుతున్న కేంద్రం - రోజు ఎన్ని గంటలు పని చేయాలంటే

0
38

కార్మిక దోపిడిని ఎన్నడు ఎవరూ సహించకూడదు, యాజమాన్యాలు కొన్ని మాత్రం ఇలాంటి విషయంలో ఇంకా శ్రమదోపిడి చేస్తున్నాయి అని చాలా విమర్శలు వస్తున్నాయి, వారికి శాలరీ ఆపడం లేదా ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటాయి , అయితే వారిని రోజుకి 8 గంటల కన్నా ఎక్కువ పని చేయించకూడదు అని రూల్ ఉంది, కాని కొన్ని కంపెనీలు అధనంగా 10 గంటలు లేదా 9 గంటలు పని చేయించుకుంటున్నారు, సాధారణ జీతాలు ఇస్తున్నారు.

ఇక ఇలాంటి వారి ఆటకట్టిస్తుంది కేంద్రం, కేంద్ర కార్మిక శాఖ నిబంధనల ప్రకారం రోజుకి 8 గంటల పని మాత్రమే చేయాలి, అంతేకాదు వారానికి ఓరోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది.. తాజాగా కార్మికుల పనివేళలు పై కేంద్ర కార్మిక శాఖ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది.

కార్మికుడు అన్ని రకాల విరామాలతో కలిపి రోజుకు 12 గంటలు మాత్రమే పని చేయాలి. వారంలో మొత్తం 48 గంటలు పని చేయాలి, ఒకవేళ కార్మికుడికి ఇష్టం ఉండి కంపెనీ ప్రొడక్షన్ పెంచాలి అనే ఉద్దేశ్యంలో వారు కోరితే అధనంగా పని చేసిన గంటలకు జీతం ఇవ్వాల్సిందే… ఓటి అలవెన్స్ లభిస్తుంది అంటూ కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదన తీసుకు వచ్చింది. పత్రీ నాలుగు గంటలకు
అతను విరామం తీసుకోవచ్చు.