కొత్త అవతారంలో అనుష్క.. ఇది క్లిక్ అయ్యేనా..!!

కొత్త అవతారంలో అనుష్క.. ఇది క్లిక్ అయ్యేనా..!!

0
60

బాహుబలి చిత్రంతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనుష్క.. ఆ సినిమా తర్వాత భాగమతి సినిమా తో మంచి హిట్ కొట్టినా ఈ ముద్దుగుమ్మ కి వరుస అవకాశాలు రాలేదు.. అప్పటికే లావు పెరిగిపోవడంతో అనుష్కపై ఎవరు ఆసక్తి చూపించలేదు.. దాంతో కొంత గ్యాప్ తీసుకుని సన్నగా మారి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది అనుష్క.. ప్రస్తుతం సైలెన్స్ అనే ఛితంలో నటిస్తున్న అనుష్క త్వరలో ఓ కొత్త అవతారం లో కనిపించనుందట..

అనుష్క ఇప్పుడు యాంకర్ గా కనిపించబోతుంది.. తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్స్ పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగు పెడుతుంది. గత సీజన్ కి నాని వాఖ్యతగా వ్యవహరించగ, మొదటి షో కంటే రసవత్తరంగా ఎక్కువ వివాదాలతో నడిచింది. ఇప్పుడు సీజన్ 3 కి నిర్వాహకులు రంగం సిద్ధం చెసుకున్నారు. ఈ సీజన్ కోసం మొత్తం 20 మందితో కంటెస్టెంట్స్ జాబితా అయితే రెడీ అయినట్టు తెలుస్తోంది.కాగా ఈసారి హీరోయిన్‌ని హోస్ట్‌గా తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన బిగ్‌బాస్ నిర్వాహకులకు వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా హీరోయిన్ అనుష్కను సంప్రదించి ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అదే నిజైమెతే బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా అనుష్క ఏ విధంగా రాణిస్తుందీ, ఆ కార్యక్రమానికి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది అందరికీ ఆసక్తి కలిగించే అంశమే.