అప్పుడు ఎన్టీఆర్ తో చేశాడు, ఇప్పుడు బాల‌య్య‌తో చేస్తున్నాడు

అప్పుడు ఎన్టీఆర్ తో చేశాడు, ఇప్పుడు బాల‌య్య‌తో చేస్తున్నాడు

0
103

అందాల రాక్షసి సినిమాతో త‌న న‌ట‌న‌తో మంచి అవ‌కాశాలు సంపాదించారు హీరోగా న‌వీన్ చంద్ర… ఆ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు ఆయ‌న.. ఇటీవల త్రివిక్రమ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు ఆయ‌న న‌ట‌నకు అంద‌రూ శ‌భాష్ అన్నారు.

ఇక తాజాగా ఆయ‌న హీరో బాల‌య్య సినిమాలో కూడా న‌టిస్తున్నార‌ట.‌
బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా‌లో ఆయ‌న న‌టిస్తున్నార‌ట‌.

బాలయ్య కోసం బోయపాటి పవర్ ఫుల్ విలన్లను ఎంపిక చేస్తున్నాడట. అందులో ఓ విలన్ గా హీరో శ్రీకాంత్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్ర ఉండబోతుందట. ఆ పాత్ర కోసం యంగ్ యాక్టర్ నవీన్ చంద్రను ఎంపిక చేసినట్లు వార్తలు వ‌స్తున్నాయి, మొత్తానికి ఈ వార్త తెలియ‌డంతో ఈ సినిమాలో బాల‌య్య‌తో ఆయ‌న ఏ క్యారెక్ట‌ర్ చేస్తారో అని ఆలోచ‌న చేస్తున్నారు అంద‌రూ.