నేను ప్రభాస్‌ని అనలేదు: అర్షద్ వార్సీ

-

కల్కీ సినిమాలో ప్రభాస్ నటన, పాత్ర గురించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ(Arshad Warsi) చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అర్హద్‌కు మైండ్ పోయిందని, ప్రభాస్‌ ఎదుగుతున్నాడన్న కుళ్లుతోనే అతడు ఇలా మాట్లాడుతున్నాంటూ అభిమానులు విరుచుకుపడ్డారు. ఆఖరికి పలువురు నటులు సైతం అర్షద్‌పై మండిపడ్డారు. ఒక నటుడి గురించి అలా మాట్లాడటం తప్పని, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ‘కల్కి సినిమాలో ప్రభాస్‌ను జోకర్‌లా చూపించారు’ అన్న అర్షద్ వ్యాఖ్యలు సృష్టించిన ప్రకంపనలు అంతాఇంతా కాదు. తాజాగా తన వ్యాఖ్యలపై అర్షద్ క్లారిటీ ఇచ్చాడు. అసలు తానన్నది ప్రభాస్‌(Prabhas)ని కాదని వివరించాడు. అబుదాబీ వేదికగా జరిగిన IIFA-2024 ఈవెంట్‌లో అర్షద్ తన మాటలకు వివరణ ఇచ్చాడు. ప్రభాస్ ఎంతటి నటుడో తనకు తెలుసని అన్నాడు.

- Advertisement -

‘‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. నేను కేవలం పాత్ర గురించే మాట్లాడాను. వ్యక్తిని ఉద్దేశించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభాస్ గొప్ప నటుడు. ఆ విషయాన్ని ప్రభాస్ అనేక సార్లు నిరూపించుకున్నాడు. ప్రభాస్ గురించి మనందరికీ తెలుసు. కానీ మంచి నటుడికి చెడ్డ పేరు వచ్చినప్పుడు అది ప్రేక్షకులను ఎంతో బాధిస్తుంది. ప్రభాస్ గురించి నేను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని చెప్పాడు అర్షద్(Arshad Warsi).

Read Also: ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...