ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

-

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫ్యామిలీ అంతా ఫేమస్సే. ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ గురించి అయితే తెలియని వారుండరు. కాగా ప్రస్తుతం బిగ్ బీ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు అధికంగా ఉన్నాయని, ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోవాలని కూడా చూస్తున్నారని కొంత కాలంగా తెగ ప్రచారం జరుగుతుంది. ఐశ్వర్యారాయ్‌(Aishwarya Rai)కు, అత్త జయాబచ్చన్‌కు ఏమాత్రం పడటం లేదని, అన్ని విషయాల్లో ఒకరు ఎడ్డెమంటే మరొకరు తెడ్డమనేలా పరిస్థితులు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఆఖరికి అమితాబ్ కూడా తన కోడలు ఐశ్వర్యారాయ్‌కు వ్యతిరేకంగానే ఉన్నారని, అందుకనే అన్ని అంశాల్లో కూతురికి అండగా ఉండే బిగ్‌బీ.. కోడలు ఐష్‌కు అవార్డ్ వచ్చినా పట్టించుకోలేదని, ఎక్కడా దాని ప్రస్తావన కూడా తీసుకురాలేదని నెటిజన్లు కూడా బిగ్‌బీ ఫ్యామిలీని తిట్టిపోస్తున్నారు. ఐష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ అపోహలు, రూమర్లపై తాజాగా సీనియర్ నటి సిమి గరెవాల్ ఘాటుగా స్పందించారు.

- Advertisement -

‘‘చాలా కాలంగా ఈ ప్రచారాలను చూస్తున్నాను. కానీ స్పందించ దల్చుకోలేదు. కానీ ఈ మధ్య ఇవి మరీ హద్దు మీరుతున్నాయి. బచ్చన్ కుటుంబం గురించి మీకు ఏమి తెలుసు. ఏమీ తెలియదు. ఒక చాలు ఆపేయండి’’ అంటూ నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంలో నిజం లేకుంటే బిగ్ బీ(Amitabh Bachchan) ఫ్యామిలీ ఎందుకు క్లారిటీ ఇవ్వలేదని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి రానున్న కాలంలోనైనా బచ్చన్ ఫ్యామిలీ ఈ ప్రచారాలపై స్పందిస్తుందేమో చూడాలి.

Read Also: జిగ్రా ట్రైలర్.. అలియా అదరగొట్టేసిందిగా..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...