పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ తమిళ్ లో రీమేక్

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ తమిళ్ లో రీమేక్

0
55

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఇప్పుడు తమిళ్ లో రీమేక్ అవుతుంది.లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుందర్ సి దర్శకత్యం వహిస్తున్న ఈ చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో శింబు సరసన మేఘ ఆకాష్ నటిస్తుంది. ఈ సినిమాలో శింబు అత్త పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. ప్రణీత పాత్ర కోసం ఎవర్ని ఫైనలైజ్ చెయ్యలేదని సమాచారం. ప్రస్తుతం హీరో ఫారెన్ లో ఉండే సీన్స్ ని షూట్ చేస్తున్నారు.

తమిళనాడులో శింబుకి అసలు మార్కెట్ లేదు, ఇప్పుడు ఇలాంటి అవకాశం రావడంతో చాల సంతోషంగా ఉన్నాడు. నిజానికి అత్తారింటికి దారేది సినిమా స్టోరీ కొత్తదేమీ కాదు, త్రివిక్రమ్ మాటలవలన మరియు ఈ సినిమా ముందుగానే లీక్ అవ్వడంతో సింపతీ తో రికార్డ్స్ క్రీయేట్ చేసిందికాని అంత గొప్ప సినిమా కాదు అంటున్నారు సినీ విమర్శకులు.ఇప్పుడు ఈ కథను సుందర్ సి ఎలా తెరకెక్కిస్తాడో. ఈ సినిమా అక్కడ హిట్ అవుతుందో లేదో అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.