అవికా గోర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయ కార్యక్రమాలు అవసరం లేదు. ప్రతీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈమె సినిమాలు చేయడం లేదు. కేవలం సీరియల్స్ తోనే బిజీగా ఉంది.తనకు లైఫ్ ఇచ్చిన సీరియల్స్ వైపు అడుగులు వేస్తుంది ఈ చిన్నారి పెళ్లికూతురు.
మధ్యలో సూపర్ హాట్‌గా మారిపోతూ.. అభిమానులకు సర్ ప్రైజింగ్ గిఫ్టులు ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇలాంటి షాకే ఇచ్చింది ఈ భామ. తాజాగా ఈమె మేకోవర్ చూసి వారెవ్వా అంటూ ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్.